ఎల్నినో ప్రభావం విద్యుత్ శాఖకు తగిలింది. వేసవిని తలపించేలా ఎండలు భగభగ మండు తుండటంతో కరెంట్ వినియోగం పెరిగింది. దీంతో ఈనెల మొదటివారం నుంచి లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు ప్రారంభమయ్యాయి.
రాళ్లపాడులో నీరు అడుగంటిపోతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేర లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 5.3 అడుగులకు పడిపోయింది.
ప్రభుత్వ, ప్రభుత్వరంగ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) ఎన్నికలకు సంబం ధించి మరో ముందడుగు పడింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన తల్లిదండ్రులు/సంరక్షకుల జాబితాలను శుక్రవారం ప్రకటించారు.
అద్దంకి పట్టణానికి రెండు వైపులా మినీ బైపాస్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నామ్ రోడ్డులో రామ్నగర్ సమీపంలో సూర్య రెస్టారెంట్ వద్ద నుంచి శింగరకొండ సమీపంలో, మరలా నామ్ రోడ్డులో కలిసేలా మినీ బైపాస్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
వైసీపీ నేతలు చిల్లర మాటలతో సంస్కారహీనంగా ప్రవర్తిస్తే ప్రజలే వారికి తగినబుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరించారు.
సహేతుక కారణాలు లేకుండా ఓటరు దరఖాస్తులను, అభ్యంతరాలను తిరస్కరించవద్దని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
డీఎస్సీపై వైసీపీ చేస్తోన్న రాద్ధాంతంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జలహారతి పనులు జిల్లాలో భారీగా జరిగాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో వివిధ వనరుల పునరుద్ధరణ, పటిష్టత, సమర్థ నిర్వహణకు సంబంధించి సుమారు రూ.37.14 కోట్లు వెచ్చించారు.
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులంతా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. వీరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల్లోని దాదాపు 10వేల కుటుంబాల వారు గ్రామాలను వదిలి బయటకు వచ్చేశారు.
జోరు వానలు కురవాల్సిన సమయంలో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో వేసవిని తలపించేలా బుధవారం పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.