అంబటి దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:12 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అసభ్యపదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను కందుకూరులో శనివారం రాత్రి దహనం చేశారు.
కందుకూరులో టీడీపీ నేతలు, కార్యకర్తల నిరసన
కందుకూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అసభ్యపదజాలంతో దూషించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను కందుకూరులో శనివారం రాత్రి దహనం చేశారు. తెలుగుయువత, తెలు గు మహిళా విభాగాల ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగింపు చేశారు. స్థానిక పోస్టాఫీసు కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు దామా వెంకటేశ్వర్లు, పిడికిటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మౌనిక, వడ్లమూడి సురేష్, గుర్రం మాల్యాద్రి, రఫి, చదలవాడ కొండయ్య, మౌనిక, శైలజ, మాదాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.