Share News

వైసీపీ నేతల తీరు దారుణం

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:10 AM

గడచిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ నేతల తీరు దారుణం

మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి

అంబటి వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్య

తూర్పునాయుడుపాలెం (కొండపి), జనవరి31 (ఆంధ్రజ్యోతి): గడచిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ నాయకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా, వైసీపీ నేతలు ఇంకా సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని స్వామి విమర్శించారు. అల్లర్లు లేని రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆ కుట్రలో భాగంగానే అంబటి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే అంబటి రాంబాబుపై ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగానే, మిగతా నాయకులకు ప్రజలు బుద్ధిచెబుతారని స్వామి పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 02:10 AM