Share News

ఒక్కరోజే రూ. 2.47 కోట్లు

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:09 AM

భూముల విలువ ఆది వారం నుంచి పెరగనుండటంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిక్కిరిసి పోయాయి. శనివారం ఒక్కరోజే 551 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగగా రూ.2.47 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

ఒక్కరోజే రూ. 2.47 కోట్లు
క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్న ఒంగోలులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

కిక్కిరిసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

ఒంగోలు క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : భూముల విలువ ఆది వారం నుంచి పెరగనుండటంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిక్కిరిసి పోయాయి. శనివారం ఒక్కరోజే 551 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగగా రూ.2.47 కోట్ల మేర ఆదాయం వచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు కార్యకలాపాలు కొనసాగాయి. అత్యధికంగా ఒంగోలులో 114, మార్కాపురంలో 114 రిజిస్ట్రేషన్లు చేశారు. దర్శిలో 72, కనిగిరిలో 63, ఎర్రగొండపాలెంలో 27, సింగరాయకొండలో 27, పొదిలిలో 41, కంభంలో 23, గిద్దలూరులో 23, సంతనూతలపాడులో 19, చీమకుర్తిలో 16, అమ్మనబ్రోలులో 12 డాక్యుమెంట్లు చేశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా రిజిస్ర్టార్‌ బాలాంజనేయులు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 02:09 AM