విద్య, వైద్యం, వనం ప్రతి ఒక్కరికీ అవసరం
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:16 AM
విద్య, వైద్యంతోపాటు వనం కూడా నేడు ప్రతిఒక్కరికీ అవసరంగా మారిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. పర్యావ రణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తు గందరగో ళంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ తమవంతుగా ఒక వనం పెంచేం దుకు సిద్ధపడాలని సూచించారు.
ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
కందుకూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): విద్య, వైద్యంతోపాటు వనం కూడా నేడు ప్రతిఒక్కరికీ అవసరంగా మారిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. పర్యావ రణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తు గందరగో ళంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ తమవంతుగా ఒక వనం పెంచేం దుకు సిద్ధపడాలని సూచించారు. శనివారం కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 ఎకరాల విస్తీర్ణంలో స్కంధపురి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మియావాకీ ఫారెస్టు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తోపాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టరు రాజాబాబు తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా నగర వనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయ న్నారు. ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా తమవంతుగా పాల్గొంటుండటం అభినం దనీయమన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 50శాతం మేరకు పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. మన చుట్టూ పచ్చదనం ఉండే లక్ష్యంతో ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లా డుతూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తే ఎంత దుర్లభంగా ఉంటుందో మనం కరోనా సమయంలో చూశామని, అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత కావాలని కోరారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా పట్టణంలోని టిడ్కో గృహాల సముదాయం వద్దకు సిమెంటు రోడ్డు నిర్మాణం, ఏకలవ్య నగర్‌లో సిమెంటు రహదారి, కాలువల నిర్మాణం కోసం రూ.86.50 లక్షలతో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, కందుకూరు సబ్‌కలెక్టరు దామెర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, స్కంధపురి సేవాసమితి కన్వీనర్ పువ్వాడి మౌనిక తదితరులు పాల్గొన్నారు.