Share News

ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:09 AM

ఆర్టీసి డిపోలో వసతుల కల్పనే లక్ష్యం అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం గిద్దలూరు ఆర్టీసీ డిపో ఆవరణలో రూ.53లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి

రూ.53లక్షలతో డిపో

ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులకు

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శంకుస్థాపన

శ్రీశైలంకు కొత్త బస్సు ప్రారంభం

గిద్దలూరు టౌన్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసి డిపోలో వసతుల కల్పనే లక్ష్యం అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం గిద్దలూరు ఆర్టీసీ డిపో ఆవరణలో రూ.53లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సత్యనారాయణ, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురే్‌షరెడ్డితో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం ప్రయాణికులకే కా కుండా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ ఉద్యోగులకు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈడీ నాగేంద్రప్రసాద్‌, సీడీఎం రవికాంత్‌, ఇన్‌చార్జి డిపో మేనేజ ర్‌ మౌనిక, మార్కెట్‌యార్డు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, బౌన్సర్లు, నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలంకు బస్సు ప్రారంభం

పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుంచి నూతన బస్సు సర్వీసును శనివారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. అధికారులతో కలిసి నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వీసును ప్రారంభించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంకు వెళ్లే భక్తులకు రవాణా ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఈసర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రయాణికుల కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా అనేక సర్వీసులను రద్దు చేసిందని విమర్శించారు. కొత్త బస్సును కొంతదూరం నడిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు అందచేశారు. జీరో ఫెల్యూర్స్‌ అవార్డుకు గిద్దలూరు డిపో ఎన్నిక కావడంతో సిబ్బందిని ఇన్‌చార్జి డీఎం మౌనకను అభినందించారు.

జోనల్‌ చైర్మన్‌ను కలిసిన బీజేపీ నాయకులు

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గిద్దలూరు వచ్చిన ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురే్‌షరెడ్డిని బీజేపీ నాయకులు డాక్టర్‌ జె.వి.నారాయణ, రామాంజనేయులు, రమే్‌షరెడ్డి, చంద్రమోహన్‌, ఉదయ్‌శంకర్‌, బాదుల్లా, ఎం.శ్రీనివాసులు, రంగస్వామి, కె.నరసింహులు, ఎస్‌.రవికుమార్‌ తదితరులు ఆయనను కలిశారు. గిద్దలూరు డిపోకు మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.

Updated Date - Feb 01 , 2026 | 12:09 AM