ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:14 AM
ప్రజా సమస్యల పరిష్కారానిక ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
పొదిలి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారానిక ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా కందుల మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలను పరిష్కరించాలన్నారు. వినతులు ఇచ్చేందుకు వచ్చేవారిని ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. తాగునీరు, పింఛన్‌లు, ఇంటి పట్టాలు, పొలం సమస్యలపై 134 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ క్రిష్ణారెడ్డి, కమీషనర్ మారుతీరావ్, కార్యాలయ ఏవో శ్రీనివాసరావు, ఏఎంసీ ఇమాంసాహెబ్ అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆక్రణలను తప్పకుండా స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని, ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే కందుల పేర్కొన్నారు. డ్రైనేజ్ కాలువలపై ఆక్రమించి ఇళ్లు కట్టి డ్రైనేజీ సమస్య ఉందని ప్రభుత్వంపై బురదచల్లాలని ప్రయత్నిస్తున్న విషయం నాకు తెలుసన్నారు. సమస్య సృష్టిస్తున్న వారికి త్వరలో బుద్ధి చెప్తామన్నారు.
మార్కాపురం అభివృద్ధి ప్రదాత చంద్రబాబు
మార్కాపురం రూరల్ : మార్కాపురం అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడి పేర్కొన్నారు. మండలంలోని బొందలపాడు గ్రామంలో శనివారం రాత్రి రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలాతీసిందన్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, పేదలకు పథకాల చేరవేతను సీఎం చంద్రబాబు పరుగెత్తిస్తున్నారన్నారు. అనంతరం మహిళలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మార్కెట్ యార్టు చైర్మన్ వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారి నాసర్‌రెడ్డి, మస్తానయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.