చిత్తశుద్ధితో భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:11 AM
భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జేసీ పీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కనిగిరి డివిజన్ స్థాయి తహసీల్దార్‌లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జేసీ శ్రీనివాసులు
అన్న క్యాంటీన్ పరిశీలన
కనిగిరి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జేసీ పీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కనిగిరి డివిజన్ స్థాయి తహసీల్దార్‌లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే క్రమంలో సంబంధిత పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహింమీ మీకోసం తమ సమస్యలపై పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించే రీసర్వే జిల్లాలో 816గ్రామాల్లో పూర్తయినట్లు తెలిపారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పడిన నేపఽథ్యంలో తగిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లాలోని డివిజన్ కేంద్రాల్లో కూడా డీఎ్‌సపీ, ఆర్‌టీవో కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. కనిగిరి డివిజన్ స్థాయి డీఎ్‌సపీ, ఆర్‌టీవో కార్యాలయాల ఏర్పాటుకై తగిన స్థలాన్ని గుర్తించి అనతి కాలంలోనే నిర్మాణాలు చేపడతామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితా భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ కింద గుర్తించిన భూములను తిరిగి పునఃపరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్‌లు వాసుదేవరావు, జయలక్ష్మి, ధర్మతేజ పాల్గొన్నారు.
క్యాంటీన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి
అన్న క్యాంటీన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని జేసీ శ్రీనివాసులు క్యాంటీన్ నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు. శాఖాపరైమన పరిశీలనలో భాగంగా కనిగిరిలో అన్నాక్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనం జరుగుతున్న సమయంలో క్యాంటీన్‌ను పరిశీలించిన ఆయన అక్కడ అపరిశుభ్రంగా ఉంచడంపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. గ్లాసులతో పాటు ప్లేట్లు, వాష్‌బేసిన్‌లను ఎప్పటికప్పడు క్లీన్ చేయాలన్నారు. క్యాంటీన్‌లో భోజనం పరిశీలించి రుచి గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట ఆర్డీవో కేశవర్దన్‌రెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.