Share News

అక్రమాల నిగ్గుతేలుస్తాం

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:08 AM

ఎరువుల విక్ర యాల్లో అక్రమాలను నిగ్గుతేలుస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘అలా నీరుగార్చారు’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని పలువురు హోల్‌సేల్‌ డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీచేశామని చెప్పారు.

అక్రమాల నిగ్గుతేలుస్తాం

జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు

దర్శి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎరువుల విక్ర యాల్లో అక్రమాలను నిగ్గుతేలుస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘అలా నీరుగార్చారు’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని పలువురు హోల్‌సేల్‌ డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీచేశామని చెప్పారు. మిగిలిన వారికి కూడా నోటీసులు పంపించి రికార్డులు తనిఖీ చేస్తామన్నారు, అక్రమాలకు పాల్పడినవ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎరువుల కంపెనీలతో కూడా కొన్నిరోజుల క్రితం సమావేశం నిర్వహించి యూరియాతోపాటు లింక్‌లు అంటకట్టవద్దని, ఎమ్మార్పీకి మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. నిబంధనలు అతి క్రమించితే 1985 యాక్ట్‌ ప్రకారం కఠినచర్యలు తీసు కుంటామని హెచ్చరించినట్లు ఆయన వివరించారు. ఎక్కడైనా రైతులకు యూరియా అందకపోతే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Updated Date - Feb 01 , 2026 | 02:08 AM