ఒంగోలు నగర కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావుకు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్‌డీఎంఏ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీచేసింది.
రాచర్ల కెజిబివి (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) పాఠశాలను జీసీడీవో కోగంటి హేమలత మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి బాలికలు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పధాన మంత్రి కిసాన్ స్కీం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మార్కెట్‌యార్డు ఆవరణలో ఈనెల 19 బుధవారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాసం వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పేదల అభ్యున్నతి కోసం దివంగత నేతలు వంగవీటి మోహనరంగా, కనకం వెంకయ్యలు జీవితాంతం కృషి చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
తెలుగు దేశం పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మెల్యే డా క్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పీసీపల్లి మండలం లోని పీసిపల్లి సర్పంచ్ మరియమ్మ వైసీపీని వీడి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు.
పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తద్వార గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు సూచించారు
ఒంగోలు నగరం త్రోవగుంట గ్రామంలోని శ్రీగంగా పార్వతీసమేత శ్రీమూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి మాస శివరాత్రి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు ఆమంచి ఉదయభాస్కర్ వైభవంగా నిర్వహించారు
మొంథా తుఫాన్ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి.