Share News

పాస్‌ పుస్తకాల పంపిణి వేగవంతం చేయండి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:02 PM

సమస్యలను పరిష్కరించాక పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం సోమవరప్పాడు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మేదరమెట్ల సచివాలయంలో ఆమె పరిశీలించారు.

పాస్‌ పుస్తకాల పంపిణి వేగవంతం చేయండి
పాస్‌ పుస్తకాల పంపిణి కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి

జేసీ కల్పనాకుమారి

మేదరమెట్ల, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి) : సమస్యలను పరిష్కరించాక పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం సోమవరప్పాడు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మేదరమెట్ల సచివాలయంలో ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఎక్కువ ఉండడాన్ని చూసి రైతులకు సమాచారం అందించారా లేదా అని ప్రశ్నించారు. గ్రామంలో ఎన్ని ఎకరాలు భూమి ఉంది, పరిష్కరించగా మిగిలిపోయిన సమస్యలు ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగులు లేకపోవడం చూసి పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వేకి వెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మికాంత్‌ తెలిపారు. అ క్కడకు వచ్చిన రైతులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జీవీ సుబ్బారెడ్డి, వీఆర్‌వోలు ప్రియాంక, సుఽధాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవరప్పాడు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మన్నె దుర్గారావు, నాయకులు మేదరమెట్ల శ్రీనివాసరావు(శ్రీనుపంతులు), సాదినేని మస్తాన్‌రావు పాల్గొన్నారు.

రేషన్‌ షాపును తనిఖీ చేసిన జేసీ

మేదరమెట్ల సెంటర్‌లో రేషన్‌ దుకాణాన్ని జేసీ కల్పనాకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని బస్తాలను తూకం వేయించారు. అవి అన్ని కేజీ, రెండు కేజీలు బరువు తక్కువగా ఉండడాన్ని గుర్తించి డీలర్‌ సంజీవరావును ప్రశ్నించారు. స్టాక్‌ పాయింట్‌ నుంచి బియ్యం తక్కువగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 03 , 2026 | 11:02 PM