మార్కాపురం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సహదిత్ వెంకట్ త్రివినాగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న బదిలీ చేసింది. ఆయన 23వతేదీ వరకు మార్కాపురంలో విధుల్లో ఉన్నారు. తర్వాత బదిలీ అయిన స్థానానికి వెళ్లిపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు వెలిగొండ ప్రాజెక్టు కంభం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.
మండలంలోని మారెడ్డిపల్లికి చెందిన వి.గోవిందమ్మ బిడ్డతో సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న దర్శి ఎస్ఐ ఎం.మురళి గమనించారు. కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు తీసి కాపాడారు.
కురిచేడు మండలంలోని పొట్లపాడులో బుధవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ప్రజాప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచనా విధానాలతో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితోనే సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల చొప్పున రూ.18.82కోట్లను చెక్కును పంపిణీ చేశారు.
ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి కదలిక కనిపిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణపై పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.మురళీధర్ మంగళవారం సాయంత్రం డెయిరీని సందర్శించారు.
అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. జిల్లాలో 2.68లక్షల మంది రైతులకు ఈ విడత రూ.180.36 కోట్ల లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా కమలాపురంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే సభలో ఈ నిధులను విడుదల చేస్తారు.
జిల్లాలో ఉపాధి పథకం-రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్య యోజన (ఆర్జీఎస్ఏ) కింద మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. ఒక్కో భవనానికి రూ.32లక్షలు ఈ పథకం కింద ఇస్తుండగా జిల్లాకు 18 భవనాలు మంజూరయ్యాయి.
వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్రప్రభుత్వమే మెచ్చి ప్రశంసాపత్రం ఇచ్చి శభాష్ అంటూ అభినందించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత అంతర్ జిల్లాల బదిలీలు జరగలేదు.