Share News

నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యం

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:39 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విదార్థులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గట్టి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎస్సీఈఆర్టీ ద్వారా 100 రోజుల కార్యాచరణ ప్రణాళి కను ప్రకటించి పాఠశాలల్లో అమలు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యం
ప్రత్యేక తరగతుల్లో విదార్థులు

వెనుకబడిన టెన్త్‌ విద్యార్థులపై స్పెషల్‌ ఫోకస్‌

ఇప్పటి నుంచే రెసిడెన్షియల్‌ శిక్షణ

ఒంగోలు విద్య, ఫిబ్రబరి 4(ఆంధ్ర జ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విదార్థులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గట్టి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎస్సీఈఆర్టీ ద్వారా 100 రోజుల కార్యాచరణ ప్రణాళి కను ప్రకటించి పాఠశాలల్లో అమలు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువులో వెనుకబడిన, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో కనీసం పాస్‌ మార్కులు సాధించని వారిపై ప్రత్యే కంగా దృష్టి పెట్టింది. వీరికి ఇప్పటినుంచి రెసిడెన్షియల్‌ శిక్షణ ఇచ్చి వారు కనీసం పాస్‌ మార్కులు సాధించేలా రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర పాఠశాల విద్య కమి షనరు విజయరామరాజు నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో కనీస పాస్‌మార్కులు సాధించలేని విద్యార్థుల వివరాలు సేకరిస్తు న్నారు. దీనికోసం అన్ని పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు గూగుల్‌ షీట్‌ ఇచ్చి వివరా లను బుధవారం సాయంత్రానికి పాఠశాల విద్య కమిషనరు కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. పాఠశాల ఉన్న విద్యా డివిజన్‌, మండలం, పాఠశాల పేరు, కనీసం పాస్‌మార్కులు సాధించని విద్యార్థి పేరు, తల్లిదండ్రుల ఫోన్‌నెంబర్లు అడిగారు. పబ్లిక్‌ పరీక్షల్లో కచ్చితంగా ఫెయిలవుతారని భావించే వారి వివరాలను హెచ్‌ఎంలు గూగుల్‌ షీట్‌లో నింపి పంపాలి. ఈ విద్యార్థులను ప్రత్యేకంగా హాస్టళ్లలో ఉంచి శిక్షణ ఇస్తారు. తల్లిదండ్రులను ఫోన్‌ ద్వారా సంప్రదించి వారిని ఒప్పించి విద్యార్థులను శిక్షణకు తరలిస్తారు. ప్రత్యేక శిక్షణ ఎంతమంది పిల్లలకు అన్న అంశంపై గురువారం స్పష్టత రానుంది. 10వతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం స్టడీ అవర్‌లో తప్పనిసరిగా స్నాక్స్‌ అందించాలని కమిషనర్‌ ఆదేశించారు. దాతలు సహకారంతో స్నాక్స్‌ ఏర్పాటు చేయటం, ఎవరూ ముందుకు రాకపోతే పాఠశాలలలోని టీచర్లు చందాలు వేసుకుని అయినా ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు సాయంత్రం స్టిప్‌టెస్ట్‌ అయిన తర్వాత కూడా వారిని కూర్చోపెట్టి చదివించాలని, పరీక్ష పూర్తికాగానే ఇంటికి పంపరాదన్నారు. గతేడాది 40శాతం కంటే తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరారు. పాఠశాలకు రాని వారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే ఆ విద్యార్ధుల తల్లిదండ్రులను పాఠశాల పనివేళ ముగిసిన తర్వాత కలిసి వారితో మాట్లాడాలని, గతేడాది కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించేలా పాఠశాల హెచ్‌ఎంలు కార్యాచరణ రూపొందించి అమలుచేయాలన్నారు.. ఉపవిద్యాధికారులు, ఎంఈవోలు ప్రతిరోజు పాఠశాలలను సందర్శించి లక్ష్యాలు సాధించేలా కృషిచేయాలని కమిషనర్‌ ఆదేశించారు.

Updated Date - Feb 05 , 2026 | 02:39 AM