బాధ్యతలు స్వీకరించిన ‘మాలెంపాటి’
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:49 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ(ఏపీఎ్‌సఎ్‌ససీఏ) గవర్నింగ్ బోర్డు డైరెక్టర్‌గా మాలెంపాటి సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ విత్తన ధ్రువీకరణ సంస్థ బోర్డు డైరెక్టర్‌గా నియామకం
స్వర్ణ(పర్చూరు), ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ(ఏపీఎ్‌సఎ్‌ససీఏ) గవర్నింగ్ బోర్డు డైరెక్టర్‌గా మాలెంపాటి సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని విత్తన ధ్రువీకరణ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ డాక్టరు యడ్లవల్లి సతీష్ చేతుల మీదుగా గుంటూరులోని లాంలో నియామక పత్రం అందుకున్నారు. కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మాలెంపాటికి రాష్ట్రస్థాయిలో పదవి లభించటంతో పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమంకోసం తన వంతు కృషి చేస్తానన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించటమే లక్ష్యమని చెప్పారు. తనకు రాష్ట్రస్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.