దేవరపల్లి రోడ్డుకు మహర్దశ
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:48 PM
ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోనికుండా ఉన్న పర్చూరు మండలం దేవరపల్లి అర్‌అండ్‌బీ రోడ్డుకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో రహదారి అభివృద్ధికి రూ.1.76 కోట్లు నిధులు మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే ఏలూరి చొరవతో రూ.1.76 కోట్ల నిధులు మంజూరు
దేవరపల్లి(పర్చూరు), ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోనికుండా ఉన్న పర్చూరు మండలం దేవరపల్లి అర్‌అండ్‌బీ రోడ్డుకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో రహదారి అభివృద్ధికి రూ.1.76 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీవో 64ను విడుదలైంది.
ఏపీ గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌ఎ్‌సపీ) ఫేజ్ -1 కింద ఈ రహదారికి నిధులు మంజూరయ్యాయి. అందులో పర్చూరు మండలం దేవరపల్లికి చోటు దక్కింది. దేవరపల్లి రహదారి అభివృద్ధికి రూ.1.76 కోట్ల నిధులు కేటాయించింది.
పీఆర్‌ఆర్ గ్రాంట్‌లో చోటు
దేవరపల్లి రోడ్డు పెద్ద పెద్ద గుంతలు, కంకరలేచి అధ్వానంగా మారింది. రాకపోకలు సాగించాలంటే రైతులు, గ్రామస్థులతోపాటు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంబంధిత శాఖలతో సంప్రదించి నిధులు మం జూరు చేయించటంలో సఫలీకృతులయ్యారు. రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.