జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. 2021 సెప్టెంబరు 25న చైర్పర్సన్గా బూచేపల్లి వెంకాయమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీకాలం గురువారం ముగియడంతో శుక్రవారం నుంచి జడ్పీ ప్రత్యేక అధికారి పాలనలోకి రానుంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 66 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్కే ఆయేషాబేగం తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్లోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదిలింది. ఖరీఫ్ సీజన్ చివర్లో కురుస్తున్న తాజా వర్షాలతో కొంత సానుకూలత వచ్చింది. ఈ సమయంలో పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది.
కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న ఆలోచనతోనే వైసీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఏమైనా మెత్తబడతారేమోనన్న సందేహంతో బుధవారం మరో ముగ్గురు వైసీపీ నాయకులతో ఇంప్లీడ్ పిటిషన్లు వేయించారు.
ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. కొత్త విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమ లు చేయబోతోంది. ఈమేరకు రాష్ట్ర పేదరిక నిర్మూ లన సంస్థ (సెర్ప్) నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.
మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగిసింది. గురువారం నుంచి ఆయా మండలాల్లో ‘స్పెషల్’ పాలన రానుంది. ఈనేపథ్యంలో జిల్లాలో 28 మండలాలు ఉండగా 27 మండలాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులను కలెక్టర్ రాజాబాబు నియమించారు.
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఒంగోలు నగర ఓటర్ల జాబితా ఖరారైంది. ఇప్పటి వరకు నగరంలో 50 డివిజన్లు ఉండగా వాటి సంఖ్యను 62కు పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్కూళ్లలో ఈనెల 29న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఎన్నికలు జరగనున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మార్కాపురం కలెక్టర్ విజయసునీత అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో 11 ముంపు గ్రామాల్లో 2026 ఆగస్టు 31 నాటికి 18 ఏళ్లు నిండిన (మేజర్) నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించే కార్యక్రమాన్ని ఆమె బుధవారం పర్యవేక్షించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొని ఎం పీపీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల ఖా తాలో వేసుకోవాలని నియోజకర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.