మరుగుదొడ్లకు అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:17 AM
ఆర్టీసీ బస్టాండ్‌లోనిమరుగుదొడ్లకు అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ను గురువా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీ
వసతులు కల్పించాలని డీఎంకు ఆదేశం
మార్కాపురం వన్‌టౌన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్టాండ్‌లోనిమరుగుదొడ్లకు అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ను గురువా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌ను పరిశీలించి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్లకు రూ.10 దౌర్జన్యం గా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇటువంటివి పునరావృతం అయితే చర్యలు తప్పవన్నారు. బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలు శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్‌లో అవసరమైన వసతులు కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యకు జేసీ ఆదేశించారు.