రాష్ట్ర ప్రజలు కూటమికి జై కొడుతున్నారు..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:06 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమెల్యే కొండయ్య చెప్పారు.
హరిప్రసాద్‌నగర్ (చీరాల), ఫిబ్రవరి6 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమెల్యే కొండయ్య చెప్పారు. పట్టణంలోని 28వ వార్డు కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, గిడుగు మస్తాన్, అక్కల శ్రీకాంత్ రెడ్డి, బోయిన కృష్ణవారి అనుచరులతో శుక్రవారం టీడీపీలో చేరారు. అందుకు సంబం ధించి ఆ వార్డులో ఏర్పాటు చేసిన సమా వేశంలో భారీ చేరికలతో కొండయ్యకు జై కొట్టారు. పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి వార్డు వరకు భారీ సంఖ్యలో బైక్‌ర్యాలీ నిర్వ హించారు. అలాగే గడియార స్తంభం కూడలి లో ఎమ్మెల్యే కొండయ్యకు, నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాధ్‌కు గజమాలతో సత్కరించారు. అదేవిధంగా కౌన్సిలర్ వెంకటరావుకు ఎమ్మెల్యే పార్టీ కండువాతో స్వాగతించారు. అనంతరం ర్యాలీ తో వార్డులో ఏర్పాటు చేసిన సమావేశా నికి చేరుకున్నారు. అలాగే కీర్తి వెంకటరావుతో పాటు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నాయి. వీరు వైసీపీ హయాం లో కౌన్సిలర్ క్రియాశీలకంగా వ్యవహరించి చక్రం తిప్పారు. ఈక్రమంలో వైసీపీని వీడటం తో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగానే భావిం చాలి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.