పర్యవేక్షణ కమిటీలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:27 AM
ఉమ్మడి జిల్లాలో ఇంటి పన్నులు, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను పర్యవేక్షించేందుకు మూడు కమిటీలను నియమించారు. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్త ర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇంటి పన్నుల వసూలు కోసం ఏర్పాటు
తక్కువగా చేసిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై నిరంతర పర్యవేక్షణ
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఇంటి పన్నులు, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను పర్యవేక్షించేందుకు మూడు కమిటీలను నియమించారు. ఈమేరకు కలెక్టర్ రాజాబాబు ఉత్త ర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల్లో తడి చెత్త-పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంపై ఐవీఆర్‌ఎస్ ఫోన్‌కాల్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయా అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పన్ను వసూలు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆదేశిస్తారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఈనెల 15వతేదీలోపు నూరుశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించడంతో తదనుగుణంగా చర్యలు చేపట్టారు. గ్రామపంచా యతీల్లో పన్నుల వసూళ్లపై రోజువారీ పర్యవేక్షణ చేసి వెనుకబ డిన వాటిపై చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశా లతో డీపీవో వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే అఽధికారులు, సిబ్బందితో కలిసి మూడు కమిటీలను నియమించారు. వీటికి మండలాలు కేటాయించారు. మరోవైపు ఇంటి పన్ను వసూళ్లలో తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీల్లో నిరంతరం ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పర్యటించి పంచా యతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆదేశించారు.