Share News

తెల్లరాయి క్వారీపై విజిలెన్స్‌ దాడి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:20 AM

అనుమతి లేకుండా తెల్లరాయిని తీస్తున్న క్వారీపై మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు.

తెల్లరాయి క్వారీపై విజిలెన్స్‌ దాడి
విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న తెల్లరాయి

అక్రమంగా తీసిన 52టన్నుల రాయి స్వాధీనం

ఎక్స్‌కవేటర్‌, లారీని సీజ్‌ చేసిన అధికారులు

పీసీపల్లి,ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : అనుమతి లేకుండా తెల్లరాయిని తీస్తున్న క్వారీపై మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. అందిన వివరాల మేరకు.. మండలంలోని మురుగుమ్మి సమీపంలో అక్రమంగా తెల్లరాయిని తవ్వుతున్నారంటూ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్‌ అధికారులు గురువారం రాత్రి క్వారీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నిల్వ ఉన్న 52టన్నుల తెల్లరాయిని స్వాధీనం చేసుకున్నారు. తెల్లరాయిని తవ్వేందుకు ఉపయోగించిన ఎక్స్‌కవేటర్‌, లారీని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో రఫి సమక్షంలో పంచనామా చేశారు. తెల్లరాయి, వాహనాలను అధికారు అప్పగించనున్నట్లు తెలిసింది. అక్రమ క్వారీయింగ్‌పై దాడిచేసిన వారిలో మైనింగ్‌ అండ్‌ విజిలెన్స్‌ అధికారులు సురే్‌షకుమార్‌రెడ్డి, పోలురెడ్డి తదతరులు ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:20 AM