గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:34 AM
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 14, 15వ తేదీల్లో సింగరాయకొండ మండలం పాకలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ లోగోను శుక్రవారం ఆయన రాయల్ రీసార్ట్‌లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, కలెక్టర్ పి. రాజాబాబులతో కలిసి ఆవిష్కరించారు.
గౌతవరంలో రూ.73 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు భూమిపూజలో మంత్రి గొట్టిపాటి
రాచర్ల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 14, 15వ తేదీల్లో సింగరాయకొండ మండలం పాకలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ లోగోను శుక్రవారం ఆయన రాయల్ రీసార్ట్‌లో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, కలెక్టర్ పి. రాజాబాబులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని గౌతవరం గ్రామానికి రూ.73లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యేలకు జీబీసీ డైరెక్టర్ కటిక యోగానంద్ ఆధ్వర్యంలో మండల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి శివరామిరెడ్డి, పీఆర్ డీఈ ఎన్‌వీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో ఎస్. వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వర్లు, ఏఈలు రంగస్వామిరెడ్డి, సుబ్బారావు, నాయకులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.