జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామ సభలు జరగనున్నాయి. అన్ని పంచాయతీల్లో ఒకే రోజున వీటిని నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలతో డ్వామా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల కేంద్రం ఆదేశాలతో ఉపాధి కూలీల జాబ్ కార్డులన్నింటికీ ఈకేవైసీ చేశారు.
సాగర్ కవచ్ బందోబస్తుకు వచ్చి మద్యం సేవించి ఘర్షణ పడిన ముగ్గురు హోంగార్డులపై వేటు పడింది. వారిలో ఇద్దరిని సస్పెండ్ చేసిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, మరొకరిని వీఆర్‌కు పిలిచారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఆ ప్రకారం మార్చి 16వతేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
పురపాలక సంఘం పరిధిలోని 33వ వార్డు వడ్డే పుల్లయ్య యానాది కాలనీ వాసులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
పాము కాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది.
ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిచేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.
శాఖ గ్రంథాలయం చినగంజాంలో నిర్వహి స్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాల ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
చిన్న పిల్లాడున్న తల్లికి సారా ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని పెద్దమంతనాల గిరిజనగూడెంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
సాగర్ కవచ్ విఽధులకు వచ్చిన హోంగార్డులు పూటుగా మద్యం సేవించి ముష్టియుద్ధానికి పాల్పడ్డారు.
చీటింగ్ కేసులో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు చేయిస్తానని ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లికి చెందిన మాదాల సూర్యనారాయణను హైదరాబాద్‌కు చెందిన తోట బాలాజీనాయుడు మోసం చేసినట్లు కేసు నమోదైంది.