భారీగా పొగాకు బోర్డు అధికారుల బదిలీ
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:30 AM
పొగాకు బోర్డు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని కర్ణాటకకు, అక్కడపనిచేస్తున్న వారిని ఇక్కడకు స్థానచలనం కల్పించారు. అలాగే ఆంధ్ర లో కూడా దక్షిణాది ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఉత్తరాది రీజియన్‌కు, కొందరిని గుంటూరులోని హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
హెడ్ ఆఫీస్‌కు ఒంగోలు ఆర్‌ఎం రామారావు
ఒంగోలుకు రాజమండ్రి నుంచి ప్రసాద్ నియామకం
పలు వేలంకేంద్రాల సూపరింటెండెంట్‌లకు స్థానచలనం
ఒంగోలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : పొగాకు బోర్డు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని కర్ణాటకకు, అక్కడపనిచేస్తున్న వారిని ఇక్కడకు స్థానచలనం కల్పించారు. అలాగే ఆంధ్ర లో కూడా దక్షిణాది ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఉత్తరాది రీజియన్‌కు, కొందరిని గుంటూరులోని హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఒంగోలు ప్రాంతీయ మేనేజరుతో సహా దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాల సూపరింటెండెంట్‌లు కూడా మారారు. ఒకేసారి పెద్దసంఖ్యలో పొగాకు బోర్డు క్షేత్రస్థాయి అధికారులు బదిలీ కావడం ఇటీవల కాలంలో ఇదే కావడం విశేషం. అందులో ఒంగోలులోని ప్రాంతీయ మేనేజర్ (ఆర్‌ఎం)గా పనిచేస్తున్న శీలం రామారావును గుంటూరు హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం రాజమండ్రిలో ఆర్‌ఎంగా పనిచేస్తున్న జీఎల్‌ఆర్‌కే.ప్రసాద్ నియమితులయ్యారు. ఒంగోలు ఆర్‌ఎం కార్యాలయంలో ఏఎస్ కేడర్‌లో పనిచేస్తున్న సత్య శ్రీనివాస్, పొదిలి ఏఎస్ గిరిజేష్ కుమార్‌ను గుంటూరు హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం హెడ్ ఆఫీస్‌లో ఉన్న ఎం.రవికుమార్, గోపాలపురంలో ఉన్న కె.ఆర్.మీనాను ఒంగోలు ఆర్‌ఎం ఆఫీస్‌లో నియమించారు. కొండపి, వెల్లంపల్లి, కేంద్రాలలో ఏఎస్‌లను బెంగళూరులోని డైరెక్టరేట్‌కు మార్చి హెడ్ ఆఫీస్‌లోని ఎంఎస్.రామారావును కొండపిలో, దేవరపల్లిలోని హేమస్మితను వెల్లంపల్లికి బదిలీ చేశారు.. కందుకూరు-2లోని ఎస్.రాజ్‌కుమార్‌ను రాజమండ్రి బదిలీ చేసి, హెడ్‌కోడలో ఉన్న విజయ్ కుమార్‌ను కందుకూరు-2కు బదిలీ చేశారు. కందుకూరు-1లోని శివకుమార్‌ను కొయ్యలగూడెం, కందుకురు 2లోని చంద్రశేఖర్‌ను కందుకూరు-1కు స్థానచలనం కల్పించారు. అలాగే టంగుటూరులో ఉన్న వి.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెంకు, కర్ణాటక నుంచి ఎస్.డాంగేను టంగుటూరుకు బదిలీ చేశారు. డీసీపల్లిలోని రాజశేఖర్‌ను కనిగిరికి, అలాగే జంగారెడ్డి గూడెంలోని వై.ప్రశాంత్‌ను డీసీపల్లికి మార్చారు. గోపాలపురంలో ఉన్న టి.రామ్మోహన్‌రావును పొదిలికి బదిలీ చేశారు. కనిగిరికి ఇంకా ఎవరిని నియమించలేదు. అలాగే ఒంగోలు-1, 2 కేంద్రంలోని అధికారులు బదిలీ కాలేదు.