స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ టీడీపీ బలపడుతోందని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. మంగళవారం ప్యాపిలి మండలం నేరేడుచెర్ల గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు కోట్ల సమక్ష్యంలో పార్టీలో చేరారు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తగినంత వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ లేంతక రువు పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు వెళ్లే పరిస్థితి ఉండటంతో అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కారణంగా 2,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి.
కర్నూలు జిల్లాకు పశ్చిమ ప్రాంతం కరువు, వలసలకు చిరునామాగా మారింది. ఊళ్లో పనులు లేక.. పస్తులతో ఉండలేక రైతులు, వారినే నమ్ముకున్న కూలీలకు వలసలే దిక్కు అయ్యాయి.
పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డా.పి.కృష్ణయ్య అన్నారు.
తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభు త్వాస్పత్రుల్లో పనిచేస్తున్న 1,450 మంది (కర్నూలు 727, నంద్యాల జిల్లాలో 723) కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం సాధారణ విధులు బహిస్కరించి ఆందోళనకు దిగారు.
వందశాతం చెత్త సేకరణే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
అర్హులందరికీ ఇంటి స్థలాలు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డులో నంద్యాల అర్బన్, రూరల్ తహసీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.