రమేశ్ కుటుంబానికి అండగా ఉంటాం
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:32 AM
హత్యకు గురైన ఎమ్మార్పీఎ్‌సఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
తుగ్గలి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): హత్యకు గురైన ఎమ్మార్పీఎ్‌సఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని బొందిమడుగులలో ఆయన పర్యటించి రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఎంతో చురుగ్గా పనిచేస్తున్న రమేశ్ హత్యకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమేశ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థికసాయంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిం చి ఓ పొలం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చండోలి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.