వైభవంగా శివపార్వతుల కల్యాణం
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:38 AM
నగరంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ముగిశాయి. వివిధ దేవాల యాల్లో తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వ హించారు.
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): నగరంలో మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ముగిశాయి. వివిధ దేవాల యాల్లో తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వ హించారు. సాయంత్రం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన రథోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, ఉత్సవమూర్తులకు పూజలు చేశారు.
హరిహర క్షేత్రంలో.. నగరంలోని హరిహర క్షేత్రంలో ఆదివారం అర్థరాత్రి లింగోద్భవ పూజలు, స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేదపండి తులు, ఆలయ అర్చకులు మామిళ్లపల్లి రాజేశ శర్మ, మహేశ శర్మ, ప్రస న్నకుమార్ శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెడికోవర్ హాస్పిటల్ హెడ్ మహేశ్వరరెడ్డి, న్యూరో సర్జన డాక్టర్ విశ్వకుమార్, కార్డిక్ సర్జన డాక్టర్ చంద్రశేఖర్‌లు హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి తరపున హరి హర క్షేత్రానికి మంచినీటి కూలర్‌ను సమకూరుస్తామని మహేశ్వరరెడ్డి వారికి హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం 9 గంట లకు క్షేత్రంలోని మూలమూర్తికి అన్నాభిషేకం నిర్వహించి, మధ్యాహ్నం భక్తులకు అన్నప్ర సాదం వితరణ చేశారు. రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై అధిష్ఠించి స్థానిక వీధుల్లో ఊరే గించారు. కార్యక్ర మంలో సంఘం అధ్యక్ష గౌరవాధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, సీవీ దుర్గాప్రసాద్, శ్యామసుందర శర్మ, టీవీ రవిచంద్ర శర్మ, ఎస్. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని వివిధ ఆలయాల్లో... పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని లలితాపీఠంలో లలితా సుందరేశ్వర స్వామికి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి నేతృత్వంలో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. పాతనగరంలోని నిమిషాంబాదేవి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ వర్మ ఆఽధ్వర్యంలో ఆదివారం రాత్రి నిమిషాంబాదేవి విశ్వేశ్వర స్వామి వార్ల కల్యాణం నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల దివ్యమంగళ మహారథోత్సవాన్ని స్థానిక వీధుల్లో ఉరేగించారు. అశోక్ నగర్‌లోని ద్వారకామాయి, ఆంజనేయస్వామి ఆలయంలోని శివాల యం, కప్పల్‌నగర్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం, సప్తగిరినగర్‌లోని కైలాసగిరి తదితర శైవ దేవాలయాల్లో శివరాత్రి పూజలు, స్వామి అమ్మ వార్ల కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
సి.బెళగల్: మండల కేంద్రమైన సి.బెళగల్‌లో కొండపైన వెలసిన గట్టు మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవికి అర్చకులు కల్యాణం నిర్వహించారు. మహేంద్ర, జగదీష్ దంపతులు స్వామి, అమ్మవార్లలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ చిన్న మునెప్ప, అలయ నిర్వాహకులు జంగం నాగమల్లయ్య, వీరశేఖర్, కాంట్రాక్టర్ అడివప్ప, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
గూడూరు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూ రులో వెలసిన భువనేశ్వరి నీలకంఠేశ్వరుడి రఽథోత్సవం ఆశేష భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది. సోమవారం పట్టణంలోని నీలకంఠేశ్వరుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకుడు నాగరాజు స్వామి అభిషేకం, మహా మంగళహారతీ తదితర పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లును దర్శించుకున్నారు. సాయంత్రం నీలకంఠేశ్వరుని రఽథోత్సవం ఆశేష భక్తజనుల మధ్య జరిగింది. రధోత్సవంలో చిన్నారుల కోలాటాలు, సాం స్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అర్చకుడు నాగరాజు స్వామి, స్వామివారి భక్త బృందం పాల్గొన్నారు.
చనుగొండ్లలో: గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో కేశవ, నాగలింగేశ్వర, బసవేశ్వర స్వాముల వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం చనుగొండ్ల గ్రామంలోని కేశవ, నాగలిం గేశ్వర, బసవేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.