Share News

మొక్కలు లేని సోషల్‌ ఫారెస్టు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:31 AM

అటవీశాఖ ఆధ్వర్యంలో సోషల్‌ ఫారెస్టు నర్సరీల ద్వారా సామాజిక అడవులు పెంచాలి. ఆర్‌అండ్‌బి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలి. అధికారులు వ్యవహారం వల్ల ఈ లక్ష్యం నెరవేరేనా? అనే సందేహం కలుగుతోంది.

మొక్కలు లేని సోషల్‌ ఫారెస్టు
సోషల్‌ ఫారెస్టు నర్సరీలో పిచ్చిమొక్కలు

పిచ్చి మొక ్కలతో నర్సరీ

రుద్రవరం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ ఆధ్వర్యంలో సోషల్‌ ఫారెస్టు నర్సరీల ద్వారా సామాజిక అడవులు పెంచాలి. ఆర్‌అండ్‌బి రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలి. అధికారులు వ్యవహారం వల్ల ఈ లక్ష్యం నెరవేరేనా? అనే సందేహం కలుగుతోంది. రుద్రవరం మండలంలోని హరినగరం సమీపంలో ఉన్న సోషల్‌ ఫారెస్టు నర్సరీలో మొక్కలు లేవు. పెంపకం ఆగింది. ఈ నర్సరీ 2006 నవంబరులో అప్పటి కలెక్టరు దానకిశోర్‌, అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతా్‌పరెడ్డి ప్రారంభించారు. ప్రతియేటా లక్షలాది మొక్కలు నర్సరీలో పెంచేవారు. గత రెండేళ్లుగా మొక్కల పెంపకం నిలిచిపోయింది. ఈ నర్సరీని 2006 నవంబరు 10వతేదీన ప్రారంభించారు. ఇక్కడ పెంచిన మొక్కలు ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇదంతా గతం. ఇప్పుడు ఇక్కడ పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి.

సామాజిక అడ వుల పెంపకం సాధ్యమేనా?

సోషల్‌ ఫారెస్టు నర్సరీలో మొక్కల పెంపకాన్ని సోషల్‌ ఫారెస్టు అధికారులు వదిలేశారు. నర్సరీని పట్టించుకోవడం లేదు. ఇలాగైతే సామాజిక అడవుల పెంపకం అసాధ్యమని రుజువు అవుతోంది. అయినా ఽఅధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండిపోయారు.

మొక్కలు పెంచేందుకు నివేదిక పంపించాం

నర్సరీలో 25వేలు మొక్కలు పెంచేందుకు నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతులు వచ్చిన వెంటనే మొక్కల పెంపకం ప్రారంభిస్తాం. - విజయలక్ష్మి, డిప్యూటీ రేంజర్‌, సోషల్‌ ఫారెస్టు

Updated Date - Feb 18 , 2026 | 12:31 AM