జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:40 AM
రాష్ట్ర బడ్జెట్‌లో కర్నూలు జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన డిమాండ్ చేశారు.
గూడూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌లో కర్నూలు జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన డిమాండ్ చేశారు. సోమవారం గూడూరులో సీపీఎం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆందోళన నిర్వహించారు. జె మోహన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు కూటమి ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమల ఉసేలేదని ఇది ప్రజలను మోసం చేయ డమేనన్నారు. ప్రభుత్వం స్పందించి జిల్లా సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటా యించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగన్న, నాగేష్, సురేష్, కొమ్మురాజు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.