Share News

పారిశుధ్యానికి ప్రాధాన్యత

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:53 PM

గ్రామాల్లో పారిశు ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌ అన్నారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యత
శిక్షణలో మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌

జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశు ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌ అన్నారు. భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గ్రామస్వరాజ్య అభియాన్‌-ఆర్‌జీఎస్‌ఏ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని గ్రేడ్‌-4, గ్రేడ్‌-5 పంచాయతీ కార్యద ర్శులకు సోమవారం డీపీఆర్‌సీ భవనంలో శిక్షణ ప్రారంభించారు. డీపీఓ భాస్కర్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యదర్శులకు ఎం తగానో ఉపయోగప డుతుందన్నారు. పారిశుఽధ్యం మెరుగుపడితే ప్రజల ఆరోగ్యం బాగుంటుం దని, ఆర్థికంగా ప్రజలు స్థిరపడితే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇంటి పన్నుల వసూళ్ల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవ చ్చనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయతీలో నిర్వహించాల్సిన రికార్డులను ఖచ్చి తంగా నిర్వ హించాలన్నారు. డీపీఆర్‌సీ కో ఆర్టినేటర్‌ మంజుల వాణి, ట్రైనింగ్‌ మేనే జర్‌ గిడ్డేష్‌, పరిపాలన అధికారి కృష్ణారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ వేణు గోపాల్‌, టీఓటీలు ఆస్రఫ్‌ భాష, పి. జగన్నాథం, బి.పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:53 PM