Share News

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చెయ్యండి

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:28 AM

ఆళ్లగడ్డ పట్టణంలోని యాబై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయ్యాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోఆరు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ వైద్య సదుపాయాలు సక్రమంగా లేక తన తల్లితండ్రులు భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిని కాపాడుకోలేక పోయామన్నారు

 వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చెయ్యండి

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణంలోని యాబై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయ్యాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోఆరు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ వైద్య సదుపాయాలు సక్రమంగా లేక తన తల్లితండ్రులు భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిని కాపాడుకోలేక పోయామన్నారు. శోభానాగిరెడ్డి ప్రమాదంలో గాయాలైన సమయంలో ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల అక్కడి నుంచి హైదరాబాదుకు తీసుకుపోయేలోపు గోల్డ్‌న్‌ అవర్‌ దాటి ఆమె ప్రాణాలు కాపాడుకోలేక పోయామన్నారు. అలాగే తప తండ్రి భూమా నాగిరెడ్డికి హార్ట్‌ఆటాక్‌ వచ్చినప్పుడు నంద్యాలకు అక్కడి నుంచి హైదరాబాద్‌ కు తీసుకెళ్లే లోపు చనిపోయారన్నారు. ఇకపై ఏ కుటుంబానికి ఇలా కాకూడదని, మంత్రికి వివరించామన్నారు. కర్నూలు-చిత్తూరు జాతీయ రహాదారి ఉండటంతో అధికంగా ప్రాణనష్టం సంభవిస్తోందఆ్నరు. తీవ్రంగా గాయపడ్డవారిని చూడలేక నంద్యాల, కర్నూలు, ప్రోద్దుటూరు, కడప ఆసుపత్రులకు ఒకే ఏడాదిలో వెయ్యి కేసులు పంపారన్నారు.

చర్యలు తీసుకుంటాం: వైద్య ఆరోగ్య శాఖా మంత్రి

ఇందుకు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుఆర్‌ యాదవ్‌ సీఎం దృష్టికి తీసుకుపోయి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వంద కిలోమీటర్‌కు ఒక ట్రామా సెంటర్‌ నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టామన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:28 AM