ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు.
కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
అంగవైకల్యం శరీరానికేనని, మనుషుల సంకల్పానికి కాదని ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్ ఓల్డ్ ఏజ్, ట్రాన్స్‌జెండర్ కమిటీ చైర్మన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.
చిన్నపిల్లల్లో మానసిక, శారీరక పెరుగుదల లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించాలని జీజీహెచ్ చిన్న పిల్లల విభాగాదిపతి డా.విజయానంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బాలల సత్వర కేంద్రం (డైస్)లో పునరావాస దినోత్సవం నిర్వహించారు.
మండలంలోని గోరంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-4ను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు రికార్డులను పరిశీలించారు.
డ్రిప్ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిందని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ ఫిరోజ్ ఖాన్ తెలిపారు.
మేము చచ్చాక కాలనీకి వస్తారా.. అసలు మా కాలనీని ఎందుకు పట్టించుకోవడం లేద’ని వైద్యులు, పంచాయతీ అధికారులపై కోసిగి 3వ వార్డు వాల్మీకినగర్ కాలనీవాసులు ఆగ్రహించారు. బుధవారం వాల్మీకినగర్‌లో బుగేని శ్రీనివాసులు, మహాదేవి, దంపతుల కుమార్తె శ్రీవిద్య (8 నెలలు) డెంగీ బారిన పడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఫీమేల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీహెచ్‌డబ్య్లూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్) పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతోంది.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని ఏడీఏ సునీత రైతులకు సూచించారు.
బనగానపల్లె పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.