ఇండ్ల నిర్మాణం పూర్తి చేయండి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:30 PM
లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు.
హౌసింగ్ పీడీ చిరంజీవి
ఓర్వకల్లు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు. గురువారం మండలంలోని నన్నూరు లేఅవుట్‌లో జరుగుతున్న ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించి కాలనీని సందర్శిం చి లబ్ధిదారులతో మాట్లాడారు. లేఅవుట్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఐహెచ్‌ఎస్‌ఎల్ మరుగుదొడ్లు నిర్మించుకో వాలన్నారు. ఇంటి నిర్మాణ బిల్లులు తదితర వాటిపై ఆయన లబ్ధ్దిదారుల కు అవగాహన కల్పించారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన గృహాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. హౌసింగ్ బిల్లులు కూడా త్వరితగతిన అందజేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎల్ ప్రభాకర్, హౌసింగ్ ఏఈ శ్రీనాథ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు నేనావత్ రాము నాయక్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మునిస్వామి, రామ్‌జీ పాల్గొన్నారు.