Share News

ముగిసిన రామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:39 AM

మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.

ముగిసిన రామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
పూజలు చేస్తున్న ఆలయ చైర్మన, ధర్మకర్తలు

ఓర్వకల్లు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఆలయ ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో వేదపండితులు జం ధ్యాల ప్రసాద్‌శర్మ, ఆలయ ప్రధానఅర్చకులు కల్లె లక్ష్మీ నారాయణ శర్మ స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో మద్దిలేటి, ఆలయ చైర్మన కాటినేని నారాయణ, ధర్మకర్త కాకి దేవేంద్ర దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పార్వేట కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి, సుగంధ ద్రవ్యాలు, దాన్యం, పూజా సామాగ్రిని హోమగుండానికి సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:39 AM