Share News

మామిడి పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:27 PM

మామిడిలో పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బనగానపల్లె జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజు రైతులకు సూచించారు.

మామిడి పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులకు సూచనలిస్తున్న జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నాగరాజు

బనగానపల్లె, ఫిబ్రవరి 19, (ఆంధ్రజ్యోతి): మామిడిలో పూత రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బనగానపల్లె జిల్లా ఉద్యానవన అధికారి నాగరాజు రైతులకు సూచించారు. మామిడిలో పూత, పిందె రాలకుండా అవలంభించే పద్ధతులపై గురువారం యాగంటిపల్లెలో రై తులకు శిక్షణ ఏర్పాటు చేశారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మాటా ్లడుతూ సూక్ష్మధాతు లోపాలు నివారించుకోవాలని సూచించారు. తెల్ల పూత దశలో రసాయన మందులు వాడకూడదని చెప్పారు. మామిడి కాయ నాణ్యత, దిగుబడి పెంచుకొని పండు ఈగ నివారణ, తేనెమంచు పురుగు ఆశించుకుండా ఉండేలా ఫ్రూట్‌ ట్రాప్‌లు, ఫ్రూట్‌ కవర్లు వాడా లని సూచించారు. హెక్టారుకు 15వేల కవర్లు ఒక్కక్కటి సబ్సిడీతో రూపా యికి ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన శాస్త్రవేత్త హేమాద్రి మాట్లాడు తూ పూత రాలకుండా మామిడి తోటలకు నీళ్లు పెట్టాలని సూచించారు. తేనెమంచు పురుగు నివారణకు చర్యల గురించి విశదీకరించారు. శాస్త్ర వేత్త రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాయ కోసిన తర్వాత, తోటను శుభ్రం గా పెట్టుకొని పండు ఈగను తగ్గించుకోవచ్చన్నారు. బనగానపల్లె ఉద్యా నన అధికారి శ్రీధర్‌ మాట్లాడుతూ మామిడి తోటలు కొత్తగా నాటే వాళ్లకి సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాగంటిపల్లె, బన గానపల్లె, పాతపాడు, రైతులు, వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు హుసేన్‌, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:28 PM