Share News

మోడల్‌ స్కూల్‌లో ఆర్‌వో ప్లాంట్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:29 AM

పట్టణ శివారులోని రవ్వలకొండ వద్ద మోడల్‌ స్కూల్‌లో మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను బీసీ ఇందిరమ్మ బుధవారం ప్రారంభించారు

మోడల్‌ స్కూల్‌లో ఆర్‌వో ప్లాంట్‌ ప్రారంభం
మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న బీసీ ఇందిరమ్మ

బనగానపల్లె, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని రవ్వలకొండ వద్ద మోడల్‌ స్కూల్‌లో మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను బీసీ ఇందిరమ్మ బుధవారం ప్రారంభించారు. డిసెంబర్‌ 27న మంత్రి పాఠశాలను తనిఖీ చేయగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్ధినులు కోరారు. స్పందించిన మంత్రి రూ.2లక్షల సొంత నిధులతో కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ పట్టణంతోపాటు, గ్రామాలల్లో బీసీ జనార్ధన్‌ రెడ్డి సొంత నిధులతో అనేక మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్ధులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. ఏ సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకవస్తే పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, బీసీ ఇందిరమ్మ పాఠశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 12:29 AM