Share News

26న జాబ్‌మేళా

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:26 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ కేవీకే స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించనున్న జాబ్‌మేళాను వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్‌రెడ్డి పేర్కొ న్నారు.

26న జాబ్‌మేళా
జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ఆత్మకూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ కేవీకే స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించనున్న జాబ్‌మేళాను వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్‌రెడ్డి పేర్కొ న్నారు. ఈమేరకు గురువారం ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించిన బ్రోచర్లను స్థానిక కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. ఈ నెల 26వ తేది ఆత్మకూరులోని ఎన్‌టీఆర్‌ కేవీకే స్టేడియం లో జరిగే ఈ జాబ్‌మేళాకు 14 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంట ర్య్వూల ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు హాజరు కావచ్చునని చెప్పారు. మరిన్ని వివరాలకు 9154830286 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మండల, పట్టణాధ్యక్షుడు రవీంద్రబాబు, వేణుగోపాల్‌, మాజీ మండలాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:26 PM