Share News

టీజీవీ మైనార్టీ కళాక్షేత్రాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:40 AM

స్థానిక ఉస్మాని యా కళాశాల రోడ్డులో ఉన్న టీజీవీ మైనార్టీ కళాక్షేత్రాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు.

టీజీవీ మైనార్టీ కళాక్షేత్రాన్ని వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ఉస్మాని యా కళాశాల రోడ్డులో ఉన్న టీజీవీ మైనార్టీ కళాక్షేత్రాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు. బుధవారం రాత్రి కళాక్షేత్రాన్ని ఆయన రిబ్బన కట్‌ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంజాన మాసం ఆరంభం సందర్భంగా ముస్లింలు ఉప వాస దీక్షలు చేపట్టి నగరానికి శుభం కలిగేలా అల్లాను ప్రార్థించాలని కోరారు. టీజీవీ మైనార్టీ కళాక్షేత్రం భవిషత్తులో పాతబస్తీ ముస్లింల పండుగలు, ప్రత్యే క రోజుల్లో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మైనార్టీ కళాక్షేత్రం కన్వీనర్లు ఎస్‌ మహమ్మద్‌ మియా, ఎస్‌ఎండీ ఇనా యతుల్లా, రంగస్థల కళాకారులు బాలవెంకటేశ్వర్లు, శామ్యూల్‌, నౌమా న, మహబూబ్‌ ఖాన, యాగంటీశ్వరప్ప, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన కేజీ గంగా ధరరెడ్డి పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు: టీజీవీ మైనార్టీ కళా క్షేత్రంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకు లను అలరించాయి. గజల్‌ గాయకుడు ఎస్‌.మహమ్మద్‌ మియా తన గీతా లతో ఆకట్టుకోగా, ఖవ్వాలీ గాయకుడు న్యామతుల్లా బృందం ప్రద ర్శించిన ఖవ్వాలీ ప్రేక్షకులను అలరింపజేసింది. హిందీ పాటల గాయ కులు హబీబ్‌, ఇబ్రహీంల బృందం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులకు వీనుల విందు చేసింది.

Updated Date - Feb 19 , 2026 | 12:40 AM