ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:32 PM
జిల్లాకు నిధు లిస్తూ బడ్జెట్ సవరించాలని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్ట డించాలని సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాకు నిధు లిస్తూ బడ్జెట్ సవరించాలని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్ట డించాలని సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. గురు వారం కార్మిక కర్షక భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు పీఎస్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్ ప్రవేశపెట్టిన తీర్మానాలను హాజరైన వక్తలు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గస భ్యుడు కే. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. గుండ్రేవుల బాధ్యత తనదని సీఎం చెప్పి నా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం దారుణ మన్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు రూ.1450 కోట్లు అడిగితే రూ.400 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కర్నూలు నుంచి కొత్త రైళ్లు వేయకపోగా ఉండే రైళ్లను కూడ తీసేశారన్నారు. వ్యవసాయ రంగానికి, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అరకొరగా ఉన్నాయని, నిధులు కేటా యించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తేవాలని అప్పుడే నిధులు సాధించుకోగలమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మన్సూర్ రహిమాన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. జగన్నాథం, జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు తదిత రులు పాల్గొన్నారు.