ఉద్యోగావకాశాలు కల్పించే దాకా కార్మికుల ఉద్యమం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప అన్నారు.
వచ్చేనెల 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించ నున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
చాగలమర్రి మండలం మద్దూరు పాఠశాల జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిందని డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు.
జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
ప్రజాభీష్టం మేరకే విభజన, వారి అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆదోని ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది.
ఉమ్మడి జిల్లాలో కుష్ఠు వ్యాధిని నిర్మూలించేందుకు ఆరోగ్య కార్యకర్తలు నిర్వహి స్తున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వేను పరిశీలించేందుకు కేంద్ర బృంధం గురువారం కర్నూలుకు వచ్చింది.
జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ. సిరి శిక్షణ అధికారులను ఆదేశించారు.
గత వైసీపీ పాలనలో ఉపాఽధి హామీ పథకం ఆ పార్టీ నాయకులు, అను చరుల జేబు నింపింది.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పరిపాలన భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు సరస్వతమ్మ, సి.రాంగోపాల్, బసవశేఖర్, మహ్మద్ హక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిత్రంలో కనిపిస్తున్నది ఎర్రగుంట కొట్టాల గ్రామం. 278 జనాభా ఉండగా, అందరూ వ్యవసాయ కూలీలే. గ్రామానికి నేటికీ రహదారి కూడా సరిగా లేదు. గ్రామంలో చాలామంది పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకున్నా, అవి మంజూరు కాలేదు. అలాగే మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.