భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:04 AM
మహాశివరాత్రికి కాల్వబుగ్గ కు తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నందికొ ట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి
ఓర్వకల్లు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రికి కాల్వబుగ్గ కు తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నందికొ ట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖ ర్‌తో కలిసి పర్యవేక్షించారు. అంతకు ముందు శివలింగానికి అభిషేకా లు, అమ్మవారికి కుంకురార్పణ పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్వబుగ్గలో ఈ నెల 14 నుంచి 19 వరకు జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. రెండు కోనేరులను నీటితో నింపుతామని, మహిళల కోసం ప్రత్యేక స్నానపు ఘట్టాలు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు తాగునీరు, వాటర్ ప్యాకెట్లు, ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.3కోట్ల నిధులు మంజూర య్యాయన్నారు. కార్యక్రమంలో ఈవో మద్దిలేటి, సొసైటీ అధ్యక్షుడు సీఎన సుధాకర్ రెడ్డి, ఆలయ చైర్మన కాటినేని నారాయణ, ధర్మకర్త కాకి దేవేంద్ర, గ్రామస్థులు శేఖరప్ప, ఖాదర్ బాషా, బజారు, జయ కృష్ణ, గొల్ల నాగరాజు, అబ్బీ పాల్గొన్నారు.