Share News

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:59 PM

పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో జనార్థన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మాట్లాడుతున్న డీఈవో జనార్థన్‌రెడ్డి

పదో తరగతి విద్యార్థులతో డీఈవో ముఖాముఖి

అవుకు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో జనార్థన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రీ ఫైౖనల్‌ పరీక్షలను పరిశీలించారు. ప్రణాళికబద్దంగా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సూచించారన్నారు. ఎంఈవో - 2 వెంకటేశ్వరరెడ్డి, హెచ్‌ఎం దస్తగిరమ్మ, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:59 PM