Share News

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:01 AM

అఽధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఏ. సిరి హెచ్చరించారు. మంగళవారం పెద్దకడబూరులో ఆమె పర్యటించారు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
మోడల్‌ స్కూల్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

పెద్దకడబూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): అఽధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఏ. సిరి హెచ్చరించారు. మంగళవారం పెద్దకడబూరులో ఆమె పర్యటించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాస్‌ ఏజెన్సీని తనిఖీ చేశారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, డీఎస్‌వో రాజారఘువీర్‌, తహసీల్దార్‌ గీతా ప్రియదర్శిని, ఎంపీడీవో ప్రభావతి, డీఎంఅండ్‌ హెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌, రాజు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అధి కారులను ఆదేశించారు. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఆర్డీవోలు, డీఎస్పీలు, తహ సీల్దార్లు, ఎండోమెంట్లు శాఖ అధికారులతో కలెక్టర్‌, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలి

యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే నాలుగు రోజుల్లోపు పూర్తి కావాలని కలెక్టర్‌ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ ఫ్యామిలీ సర్వే కర్నూలు అర్బన్‌, ఆదోని అర్బన్‌, పెద్డకడుబూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు, కోసిగి, తుగ్గలి, నందవరం తదితర మండలాల్లో కూడా సర్వీసు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 11 , 2026 | 12:01 AM