Share News

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:05 AM

పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌ సుధాకర్‌ అన్నారు.

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో
పదో తరగతి విద్యార్థులకు సూచనలిస్తున్న డీఈవో సుధాకర్‌

గూడూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌ సుధాకర్‌ అన్నారు. మంగళవారం గూడూరులోని ఇంటిగ్రే టెడ్‌ బాలురు వసతి గృహంలో పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం డివి జనల్‌ స్థాయిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అవసర మైన ఏర్పాట్లను డీఈవో, డిప్యూటీ డీఈవో శ్రీధర్‌ బాబు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల యాక్షన ప్లాన డివిజనల్‌ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. డివిజనల్‌ స్థాయిలోని 8 మండ లాల్లోని 79 మంది విద్యార్థులకు గూడూరులోని ఇంటిగ్రేటేడ్‌ బాలురు వసతి గృహం, కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఆయన వెంట ఎంఈవో సునీలమ్మ, ఎంఈవో-2 నాగరాజు, హాస్టల్‌ వార్డెన వలి ఉన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:05 AM