తాగునీటి కోసం రాస్తారోకో
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:18 PM
జూపాడుబంగ్లా 3వ వార్డులో గత కొన్నిరోజుల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు బుధవారం కర్నూలు-గుంటూరు రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జూపాడుబంగ్లా 3వ వార్డులో గత కొన్నిరోజుల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు బుధవారం కర్నూలు-గుంటూరు రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. తాగునీరు అందించేంత వరకు రాస్తారోకో విరమించబోమని ధర్నా చేశారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమించాలని కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు విరమించమని చెప్పడంతో ఎంపీడీవో గోపికృష్ణ, ఆర్‌డ బ్ల్యూఎస్ ఏఈ నాగేంద్ర కల్పించుకుని సమస్య పరిష్కరించడానికి పైపులైను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈలోగా సురక్షిత మంచినీటిని ట్యాంకర్ల ద్వారా కాలనీకి అందిస్తామన్నారు.