వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:18 PM
జిల్లాలో పది తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీ ర్ణత సాధించడమే లక్ష్యమని డీఈవో జనార్దనరెడ్డి పేర్కొన్నారు.
పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక
డీఈవో జనార్దన్‌రెడ్డి
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పది తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీ ర్ణత సాధించడమే లక్ష్యమని డీఈవో జనార్దనరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కొలిమిగుండ్లలోని జడ్పీహెచ్‌ఎస్, మోడల్ స్కూల ల, కస్తూర్బా పాఠశాలలను తనిఖీ చేశారు. తర గతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వా రి సామర్థ్యం పరిశీలించడంతో పాటు, సమ స్యల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ‘పది’పై ప్రత్యేక ఫోకస్ పె ట్టి వంద రోజుల ప్రణాళికను పక డ్బందీగా అమ లు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 27వేల మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజర య్యే అవకాశం ఉందన్నారు. వెనుకబడిన పాఠశా లల ను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎం ఈవో శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఎం కొండప్ప, కేజీబీవీ లక్ష్మీసరోజ, సంజీవరెడ్డి, ఉపాధ్యాయులు రమణ య్య పాల్గొన్నారు.