థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహాయంపై వివరాలు సేకరించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు.
బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు.
ఫార్చ్యూన్ ఇండియా పత్రికలో మంత్రి నారా లోకేశ్‌పై వ్యాసం కోసం కోటి రూపాయలకుపైగా ప్రభుత్వ ధనం ఖర్చు చేశారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. లోకేశ్‌పై తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేతన్నల సేవలో పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు. 71,536 మందికి రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు.
కృష్ణాజిల్లా పెడనలో గురుకుల బాలికలపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి.. లండన్ వెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు.