Share News

11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:23 PM

ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.

11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu

అమరావతి, ఫిబ్రవరి 11: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) ఈరోజు (బుధవారం) ఉదయం ప్రారంభమవగా.. కేవలం 11 నిమిషాల్లోనే వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:00 గంటలకు సభ మొదలైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer) ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా సభకు హాజరైన వైసీపీ సభ్యులు.. కాసేపటికే నిరసన తెలుపుతూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు.


గవర్నర్‌కు వీడ్కోలు పలికి తిరిగి వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులతో సభాపతి మాట్లాడుతూ.. ‘వైసీపీ సభ్యులు 11వ తేదీన.. 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి.. 11 నిమిషాలు మాత్రమే ఉండి సభ నుంచి వెళ్లిపోయారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా.!’ అని అన్నారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.


ఇవి కూడా చదవండి...

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 12:46 PM