జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీచేసి నా బలం చూపిస్తా: దువ్వాడ శ్రీనివాస్
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:45 PM
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జగన్‌ను కలుస్తానని తెలిపారు. జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా పోటీ చేస్తానన్నారీ ఎమ్మెల్సీ.
అమరావతి, ఫిబ్రవరి 11: ‘వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా’ అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. శాసనమండలిలో తన వాణి వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్‌ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని దువ్వాడ వ్యాఖ్యానించారు. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
అంతకముందు.. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పిలిచి మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్ కాళ్లకు మొక్కారు దువ్వాడ. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్ శ్రీనివాస్?’ అని దువ్వాడను జగన్ పలకరించగా.. ధర్మాన ప్రసాదరావుతో ఉన్న అంశాలపై మాట్లాడాలని తెలిపారు ఎమ్మెల్సీ. దీనిపై ‘ఒకసారి కలవమని’ చెప్పి వెళ్లిపోయారు జగన్. ఈ భేటీ దువ్వాడ భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో చేరే అవకాశాలు, సొంతంగా పోటీ చేయడం తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి...
11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
Read Latest AP News And Telugu News