ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.
16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
జగ్గయ్యపేటలోని ఆర్టీసీ ప్రాంగణంలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేసినందుకు నిరసనగా.. డ్రైవర్లు బస్సులు ఆపేసి ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది.
మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని.. లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు.
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రైతులకు మేలు చూకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.