దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
స్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నిది కేంద్రమంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు.
ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ప్రేమించుకున్న ఆ విద్యార్థులు.. ఇంటి నుంచి పారిపోయి స్వతంత్రంగా ఉండాలని భావించారు. వివరాల్లోకి వెళితే..
పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.
పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సాకారానికి మరో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3ఏ ప్రతిపాదనల్లో పురోగతి నెలకొన్నా.. వివిధ దశలు పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టే అవకాశముందని ఎన్‌హెచ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికి గానీ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అంతకంతకూ వెనక్కు వెళ్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ) అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోగా.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకపోవడంతో పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది. ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తై టెక్నికల్ బిడ్లు తెరిచినా.. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి టెండర్లను ఖరారు చేయటానికి కేంద్రం అనుమతులు అవసరం. కానీ, అనుమతుల్లో జాప్యం కారణంగా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేశ్ శర్మపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విడాకుల కేసు మాట్లాడేందుకు వెళ్లిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు వెంకటేశ్ శర్మ.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.